సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి



నడికూడ, BLN తెలుగు దినపత్రిక: మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకాన్ని పరకాల శాసనస భ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడు తూ దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు నేటి నుండి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నా మని అన్నారు. ప్రజల జీవన ప్రమానా లు పెంపొందించేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుంద న్నారు. పేద ప్రజల సంక్షేమం వారి ఆర్ధిక అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభు త్వం పనిచేస్తుందన్నారు. చారిత్రక పుట్టలలో నిలిచేది పేద ప్రజలకు సన్న బియ్యం
పంపిణీ కార్యక్రమం అని, దీనిని మార్చే ధైర్యం రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వానికి లేదన్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సంబంధించి ప్రతి ఒక్కరికీ 6. కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ ఆస్తున్నామని తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న సన్న బియ్యం పథకాన్ని ఎన్నికల ముందు ఇచ్చిన మాట మేరకు రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నామన్నారు. 10 సంవత్సరాల పాలన చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. పేదలకు సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కి పరకాల నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ నాగరాజు, డిప్యూటీ తాసిల్దార్ సత్యనారాయణ, పరకాల వ్యవసాయ. మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నడికూడ మండల అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కుడ్ల మలహల్ రావు, కాంగ్రెస్ యూత్ మండల అధ్యక్షుడు అప్పం కుమారస్వామి,జీల శ్రీనివాస్, వాంకె రాజయ్య, నారగాని ఐలయ్య దుప్పటి సదానందం, జీల కుమారస్వామి, వనపర్తి నవీన్, రావుల సురేష్,వర్నెం మల్లారెడ్డి, రేషన్ డీలర్లు గడ్డం సర్వేశం, తెప్ప రవి కుమార్, దుప్పటి సుమన్, మహిళా సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post