ఉమ్మడి వరంగల్ జిల్లాశాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయం లో ఆదివారం సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించుటకు ఏర్పాటు చేస్తున్నట్లు దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు. సీతారాముల కల్యాణ కరపత్రాలను దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి అడ్వకేట్ లెక్కల జలంధర్ రెడ్డి బుధవారం ఆవిష్కరించినారు. ఆదివారం ఉదయం 10:30 గంటలకు తలంబ్రాలను తీసుకురావడం 11 గంటలకు కంది శ్రీనివాస్ రెడ్డి చే ధార్మిక ఉపన్యాసం మధ్యాహ్నం 12.05 నిమిషాలకు సీతారాముల కళ్యాణం మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని కళ్యాణ అనంతరం లెక్కల లక్ష్మీ జలంధర్ రెడ్డి దంపతులచే మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించగలరని దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు. ఈ కార్యక్రమంలో నీల సమ్మిరెడ్డి నీల రంగారెడ్డి గిద్దమారి సురేష్ కోమటి గణేష్ గొట్టిముక్కుల సుమన్ బత్తుల రాజేష్ తదితరులు పాల్గొన్నారు
సీతారాముల కళ్యాణం కరపత్రాల విడుదల.
byBLN TELUGU NEWS
-
0
Post a Comment