గణపురం మండలం, 17 ఫిబ్రవరి 2025:
భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో గడిచిన మూడు రోజుల నుండి కనులపండువగా శ్రీ సీతారామ ఆంజనేయ వేణుగోపాలస్వామి, బొడ్రాయి, పోచమ్మ మరియు పెద్దమ్మ తల్లి విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. కాగా,
ఈరోజు సోమవారం ఉదయం జరిగిన ప్రతిష్ఠాపన మహోత్సవంలో
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యేకు అర్చకులు, గ్రామస్తులు, ఆలయ కమిటీ నిర్వాహకులు, కాంగ్రెస్ నేతలు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
శ్రీ సీతారామ ఆంజనేయ వేణుగోపాలస్వామి, పోచమ్మ, పెద్దమ్మ తల్లుల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు
Post a Comment