శాయంపేట మండలంలోని హుస్సేన్ పల్లి గ్రామానికి చెందిన రాయరాకుల మొగిలిని బిజెపి సంస్థ గత ఎన్నికలలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్గా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా బిజెపి శ్రేణులు పెద్ద ఎత్తున బాణాసంచెను కాల్చి సంబరాలు జరిపారు వారు గత 30 సంవత్సరాల నుండి బిజెపి పార్టీలోనే వివిధ హోదాలో పనిచేస్తున్నారు గతంలో గ్రామ శాఖ అధ్యక్షునిగా మండల పార్టీ అధ్యక్షునిగా జిల్లా కార్యదర్శిగా జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా కూడా తన కర్తవ్యాన్ని సరిగా నిర్వహిస్తున్నారు కనుకనే అతని ఈరోజు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్గా ఎన్నుకోవడం జరిగింది తన ఎన్నికకు సహకరించిన భూపాలపల్లి నియోజకవర్గంలోని రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు కార్యకర్తలకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు
రాష్ట్ర కౌన్సిల్ మెంబర్గా ఎన్నుకోవడం
byBLN TELUGU NEWS
-
0
Post a Comment