6 గ్యారంటీలు అమలు చేయలేకనే కేంద్ర బడ్జెట్ పై అబద్ధపు ప్రచారాలు

శాయంపేట మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పార్లమెంట్లో నిర్మల సీతారాం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద మధ్యతరగతి ప్రజల రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించబడింది అన్ని వర్గాలకు సమన్యాయం చేసే విధంగా ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో రూపొందించిన డ్రీమ్ బడ్జెట్ ఇది వికసిట్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ఈ దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఈ బడ్జెట్ కీలక భూమిక పోషిస్తుందని ఇది వృద్ధిని వేగవంతం చేసే బడ్జెట్ వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిని 12 లక్షల రూపాయలకు పెంచడమే పెద్ద నిర్ణయం ఇది కోటి కుటుంబాలకు లాభం చేకూరుస్తుందని వారి డిస్పోజబుల్ ఇన్కమ్ ను పెంచి మరింత ఖర్చు చేయగల సామర్థ్యాన్ని కల్పిస్తుందని ఆయన అన్నారు ఎమ్మెస్ ఎంఈలు ద్వారామరియు చిన్న పరిశ్రమలకు మద్దతుగా నిలిచే ఈ బడ్జెట్ ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురావడంతో పాటు ఉపాధిని పెంచేలా కృషి చేస్తుంది రాష్ట్రాల హక్కులను గౌరవిస్తూ సహకార సమైక్య స్ఫూర్తిని కొనసాగిస్తూ సమగ్ర అభివృద్ధికి మరింత నిధులను కేటాయించడమే ఈ బడ్జెట్ యొక్క అంతిమ లక్ష్యం బడ్జెట్పై పై ఎలాంటి అవగాహన లేకుండా 6 గ్యారంటీ అమలు చేయ చాతగాక ఈ బడ్జెట్ పై తప్పుడు అబద్ధ ప్రచారాలు చేస్తున్నారని కేంద్ర బడ్జెట్ అన్ని రాష్ట్రాలను సమంగానే చూస్తుందని సమైక్య సహకార ఈ మద్దతుగానే బడ్జెట్ ప్రవేశపెడతారని మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ ప్రవేశపెట్టే క్రమంలో జిల్లాల వారీగా నిధులు కేటాయిస్తుందా జిల్లాల వారీగా నిధులు కేటాయిస్తే భూపాలపల్లి జిల్లాకు వారు ఎంత బడ్జెట్ కేటాయించారు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ చెప్పాలి అని అన్నారు ఈ సందర్భంగా వారు అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాయరాకుల మొగిలి మాట్లాడుతూ ఈ బడ్జెట్లో తెలంగాణకు కేటాయించిన నిధులు ఆరోగ్యం మరియు విద్య బలమైన భవిష్యత్తు కోసం బీబీనగర్ ఏమ్స్ నిర్మాణం వేగంగా కొనసాగించడానికి సనత్ నగర్ లోని Esic మెడికల్ కళాశాల మరియు ఆసుపత్రి నిర్మాణం కోసం హైదరాబాదులోని కొత్త ఆసుపత్రి నిర్మాణం కోసం ఐఐటి హైదరాబాద్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు ఉస్మానియా యూనివర్సిటీ ఎస్సీ హాస్టల్ నిర్మాణానికి ములుగు జిల్లాలోని సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ కోసం ప్రసాద్ పథకం ద్వారా రామప్ప ఆలయ అభివృద్ధికి 62 కోట్లు భద్రాచలం అభివృద్ధికి 42 కోట్లు మేడారం జాతరకు 21 కోట్లు బతుకమ్మ బోనాలు వంటి పండుగలకు కేంద్రం నిధులు తెలంగాణకు ఎప్పుడూ కేంద్రం రాష్ట్ర అవసరాలకు తగిన విధంగానే కేంద్రం నిధులు కేటాయిస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ కానుగుల నాగరాజు సీనియర్ నాయకులు విద్యాసాగర్ ఉప్పు రాజు, గడ్డం రమేష్, కొత్తపల్లి శ్రీకాంత్,మంద సురేష్, మోత్కూరి సత్యనారాయణ, కుక్కల మహేష్, బత్తుల రవి, బూత్ అధ్యక్షులు కడారి చంద్రమౌళి, బాసాని నవీన్, పున్నం సాంబయ్య, భూతం తిరుపతి, కన్నెబోయిన రమేష్, వంగరి శివ, కోమటి రాజశేఖర్, బాసాని లక్ష్మణ్, మొరే రంజిత్, తదితరులు పాల్గొన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post