తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవ హరిస్తుంది
కేంద్రం తెలంగాణకు నిధు లిచ్చేదాకా శాంతియుతంగా పోరాటంచేస్తాం
అంబేద్కర్ కూడలి వద్ద కాంగ్రెస్ పార్టీ నిరసన
ఈ నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనా రాయణ రావుతెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తుం దని, తెలంగాణ ప్రజలు బిజెపిని ఇక ఇప్పటికీ క్షమించ రని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనా రాయణ రావు మండిపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన తీవ్ర అన్యాయానికి నిరసనగా అంబేద్కర్ కూడలి వద్ద కాంగ్రెస్ పార్టీ మండల కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యే
పాల్గొన్నారు.
కొద్దిసేపు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. దేశ సమగ్రాభివృద్ధికి కాకుండా కేవలం రాజకీయ ప్రయోజనా లకే ఈ బడ్జెట్ కేటా యించినట్టు ఉందని విమర్శించారు. దేశ బడ్జెట్ బీహార్ ఎన్నికల కోసమే అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ సంక్షేమం, అభివృద్ధికొరకు పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాలని ఎమ్మెల్యే పిలుపుని చ్చారు. తెలంగాణ నుండి 8 మంది బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉండి కూడా, తెలంగాణకు పెద్ద గాడిద గుడ్డు తీసుకొచ్చారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తెలంగాణకు నిధులు కేటాయించడం జరిగిందని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ బోర్డ్ అడ్వైజర్ కమిటీ మెంబర్ బాసని చంద్రప్రకాష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి, నాయకులు చల్లా చక్రపాణి, పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి, మారపల్లి రవీందర్, బోనపల్లి రఘుపతి రెడ్డి, దుబాసి కృష్ణమూర్తి, చిందం రవి, చింతల రవిపాల్, ఐ ఎన్ టి యు సి మండల అధ్యక్షులు మారపల్లి రాజేందర్, కట్టయ్య, అబ్బు ప్రకాష్ రెడ్డి, బాసనిశాంత, డిటిరెడ్డి, మస్కే కుమార్, మామిడిపల్లి సాంబయ్య, అరికిల్ల సుధాకర్, పల్లె బోయిన రాజు, నూనె ప్రకాష్, జక్కుల సంపత్, ఐలయ్య, మోతే వెంకటేశ్వర్లు, నూనె శ్రీనివాస్, చిరంజీవి బాసర లక్ష్మీనారాయణ దుబాయ్ కృష్ణమూర్తి రాజుతదితరులు పాల్గొన్నారు.
Post a Comment