కేంద్ర బడ్జెట్ 2025-26 ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాల కలల బడ్జెట్

అన్నివర్గాల ప్రజలకు వారి సమస్యలు పరిష్కరించేలా ఈ బడ్జెట్

ప్రజలలో కాంగ్రెస్ పై వచ్చిన వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి కొత్త నాటకానికి తరలేపిన కాంగ్రెస్ పార్టీ

జయశంకర్ భూపాలపల్లి జిల్లా
మధ్యతరగతి ప్రజలకు, ఉద్యోగులకు ప్రధాని మోదీ నాయకత్వంలో రూపొందించిన బడ్జెట్ 2025 - 26 లో ₹12 లక్షల రూపాయల వార్షిక ఆదాయం పై పన్ను రద్దు చేస్తూ ప్రకటించినందుకు బిజెపి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బిజెపి జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద మనదేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అనంతరం జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి మాట్లాడుతూ
ప్రజలలో కాంగ్రెస్ పై వచ్చిన వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి కొత్త నాటకానికి తెర లేపిందని కాంగ్రెస్ పార్టీ ధ్వజం మెత్తారు
ఈదేశాన్ని ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ అని ఆ పార్టీ నాయకులు బడ్జెట్ మీద కనీస అవగాహాన లేకుండా మాట్లాడి పరువుపోగొట్టుకున్నారు అని ఇన్ని సంవత్సరాల పాలన చేసిన కాంగ్రెస్ పార్టీకి దేశ బడ్జెట్ రాష్ట్రాల వారీగా ఉండదు అనే సోయి లేకపోవడం బాధాకరంగా ఉంది అని దేశ ప్రజల కుటుంబాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పనిచేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇటలీ కుటుంబం బాగు కోసం పని చేస్తుందని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ 70 ఏండ్లు అధికారంలో చేయలేని పనులు ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం చేస్తుంది అనే అక్కసుతో కాంగ్రెస్ నాయకులు బిజెపి పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అని,తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ ఖజన కాలి అయ్యింది అని బయటకి వెళ్తే ప్రజలు భజన చేస్తారు అని తెలిసి ఈరోజు కొత్త వేషంతో రోడ్ల మీదకు వచ్చారు అని,బిఆర్ఎస్ పాలనను ప్రజలు తిరస్కరించి, మళ్లీ వద్దు అనుకొని గతి లేక కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే,ఒక్క ఏడాదిలోనే కాంగ్రెస్ చేయి ఫ్రాక్చర్ అయింది అని,ఇక రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీని ఎన్నుకోని బిజెపిని అధికారంలోకి తేవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.అనంతరం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషేధర్ రెడ్డి కి నూతన జిల్లా అధ్యక్షుడు అయినా సందర్భంగా ఘనంగా బిజెపి శ్రేణులు సన్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్నం యుగంధర్ ,రాష్ట్ర నాయకులు బట్టు రవి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎరుకల గణపతి , బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సయ్యద్ గాలిఫ్ ,ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు జగ్గయ్య ,జిల్లా నాయకులు దొంగల రాజేందర్, సామల మధుసూదన్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబర్ ఊరటి మునేందర్,దాసరి తిరుపతిరెడ్డి ,కంబాల రాజన్న,మందల రఘునాథ్ రెడ్డి ,తుమ్మేటి రామ్ రెడ్డి తాటికంటి రవికుమార్, పెండ్యాల రాజు,ఎర్ర రాకేష్ రెడ్డి,కర్వేద మనోహర్ రెడ్డి, మాచనేని రవీందర్ , కోరె సుధాకర్, గోరుకొత్తపల్లి మండల అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, కొండాల కొమురయ్య ఘనపూర్ మండల అధ్యక్షులు ఊర నవీన్ రావు నాయకులు, శివ కృష్ణ మల్లేష్ దేవేందర్, ఆసం సురేష్, దాసారం రమేష్ సుమన్, పొన్న శ్రీనివాస్, మరియు కార్యకర్తలు నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post