ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కేసీఆర్ నియోజకవర్గ ప్రజల పక్షాన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.
ఆ భగవంతుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వారు వర్ధిల్లాలని ఆకాంక్షించారు.మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని,కాంగ్రెస్ బోగస్ హామీలు నమ్మి మోసపోయామని ప్రజలు తెలుసుకున్నారన్నారు.రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు వచ్చిన బిఆర్ఎస్ సత్తా చాటుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post