మొక్కలు నాటిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి,బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినిపల్లి  సంతోష్ కుమార్ మేరకు పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి  హనుమకొండలోని ఆయన నివాసంలో వృక్షారన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు బిఆర్ఎస్ నాయకులతో కలిసి మొక్కలు నాటారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి  మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధకులు కేసీఆర్ మానస పుత్రిక అయిన హరితహారంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చడం జరిగిందని తెలిపారు.గడిచిన పదేండ్ల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని అన్నారు. కానీ పదేండ్లలో జరిగిన అభివృద్ధి గడిచిన సంవత్సర కాలంలో కాంగ్రెస్ పాలనలో చాలా నష్టానికి గురైందని అన్నారు.కాంగ్రెస్ బోగస్ హామీలు నమ్మి మోసపోయామని ప్రజలు తెలుసుకున్నారని,కేసీఆర్  మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని అన్నారు.కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు.రేపు కేసీఆర్  పుట్టినరోజు సందర్భంగా పరకాల నియోజకవర్గంలోని అన్నిమండల కేంద్రాలలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించాలని,సాఆద్యమైనంత వరకు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,యూత్ నాయకులు తదితరులుపాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post