నాడు తండ్రి. నేడు కొడుకు
చలివాగులో మునిగి మృతి
పంగిడిపల్లిలో విషాదం
BLN తెలుగు దినపత్రిక టేకుమట్ల: తండ్రి కొడుకుల
మృతి
పాలిట మృత్యువుగా మారి చలివాగు ఇద్దరిని పొట్టన పెట్టుకుంది. ఈ సంఘటన జయశం కర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం లోని పంగిడిపల్లి గ్రామంలో జరిగింది. వివారా ల్లోకి వెళ్లితే.. 2023 సెప్టెంబర్ 09న పంగిడి పల్లి గ్రామానికి చెందిన పురాణం భవాని, అతని చిన్న కొడుకు సంతోష్ కలిసి ఆశిరెడ్డి పల్లి- పంగిడిపల్లి శివారు చలివాగులో చెక్ డ్యామ్ సమీపాన చేపలు పట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలో భవాని కుమారుడు సంతోష్ చలి వాగులో పడి కొట్టుకుపోతుంటే, భవాని కాపా డేందుకు వాగులో దూకి తన కుమారుడిని కాపాడి వాగులో మునిగిపోయి మృతి చెందాడు. అప్పుడు ప్రాణలతో బయటపడిన సంతోష్ (మొగుళ్ళపల్లి హాస్టల్లో ఉంటు 9వతర గతి చదువుతున్నాడు) బుధవారం మొగుళ్ల పల్లి- చిట్యాల మండలం నవాబుపేట గ్రామాల మద్యలోని చలివాగులో దిగి లోతు గమనించ కుండా మునిగిపోయాడు. అతడితో వెళ్ళిన మరో ఫ్రెండ్ కేకలు వేస్తు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ నీటిలో మునిగిపోయాడు. చుట్టు పక్కల రైతులు వచ్చి మునిగిపోయిన సంతోష్ ని బయటికి తీసేసరికి అప్పటికే మృతి చెందాడు. ఏడాదిన్నర కాలంలో చలివాగులో ఇలా తండ్రి కొడుకులు మృతి చెందడం పట్ల అయ్యో పాపం అంటూ, మృతుల బంధువులు, గ్రామస్తులు కంటతడి పెట్టారు
Post a Comment