కాళేశ్వర దేవస్థానంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ పర్యటించారు. 9వ తేదీన మహా కుంభాభిషేకం ముగింపు కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని, రద్దీకి తగినట్లు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. శుక్రవారం నుండి ప్రారంభమైన మహా పట్టాభిషేకం మహోత్సవాలు పండితుల మంత్రోచ్చారణల మధ్య అరుదైన ఘట్టానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. శుక్రవారం ప్రారంభమైన మహా పట్టాభిషేకం, కుంభాభిషేక పూజా కార్యక్రమాలు 9వ తేదీ ముగింపు రోజున భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున రద్దీ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ నేపథ్యంలో గోదావరి ఘాట్ వద్ద స్నాన ఘట్టాలు పరిశీలించిన కలెక్టర్, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ప్రధాన ఏర్పాట్లు:
వాహన పార్కింగ్:
భక్తుల వాహనాల గోదావరి ఘాట్ వద్దకు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి కేటాయించిన పార్కింగ్ ప్రత్యేక ప్రాంతాలకు వాహనాలను మళ్లించాలని ఆదేశించారు.
పారిశుధ్య కార్యక్రమాలు:
పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహణకు 70 మంది పారిశుధ్య కార్మికులతో ప్రత్యేక పరిశుభ్రత చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు పర్యవేక్షణ బాధ్యతలు జిల్లా పంచాయతి అధికారి, డివిజనల్ పంచాయతి అధికారి, ఎంపిడిఓ, ఎంపీవో పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహణకు 4 సెక్టార్లుగా విభజించి పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
రెండు షిప్టుల్లో కార్యక్రమాలు చేపట్టేందుకు 4 మంది ఎంపీవోలు పర్యవేక్షణకు.నియమించామని తెలిపారు. ఎప్పటికప్పుడు వ్యర్థాలు తరలింపుకు 2
ట్రాక్టర్ల ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మంచినీటి సరఫరా: రెండు ట్యాంకర్ల ద్వారా ఆలయ పరిసర ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యం కల్పించామని, అలాగే ప్రధాన కూడళ్లుల్లో మంచినీటి సరఫరా చేపట్టినట్లు తెలిపారు.
ఆరోగ్య సేవలు:
అత్యవసర వైద్య కేంద్రాల ఏర్పాటు ద్వారా ప్రాథమిక చికిత్స కోసం అవసరమైన మందులు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.
వైద్యాధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలకు మహాదేవ పూర్ లోని కమ్యూనిటి ఆరోగ్య కేంద్రంలో బెడ్లు కేటాయించినట్లు తెలిపారు.
భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా నియంత్రణ చేయాలని ఆదేశించారు. నిరంతర గస్తీ ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనకు తావులేకుండా పటిష్ట పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. నిర్దేశిత ప్రాంతం దాటి భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా నియంత్రణ చేయాలని, గజ ఈతగాళ్ళు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. 9వ తేదీన ఆలయ ప్రధాన ద్వారం వద్దకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బిఅధికారులనుఆదేశించారుఈ కార్యక్రమంలో డిపిఓ నారాయణ రావు, మండల ప్రత్యేక అధికారి వీరభద్రయ్య, ఎంపిడిఓ వెంకటేశ్వర్లు, దేవస్థానం ఈఓ మహేష్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment