మహిళా అభ్యున్నతికి సావిత్రి బాయి పూలే చేసిన సేవలు మరువలేనివవి కాంగ్రెస్ శాయంపేటమండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చి రెడ్డి అన్నారు. శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ... దేశంలోనే మొదటి ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలే భారతీయ సంఘ సంస్కర్త అని, మహిళల విద్య కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పరకాల ఏఎంసి వైస్ చైర్మన్ మారపల్లి రవీందర్, మండల నాయకులు చిందం రవి, మారపల్లి రాజేందర్, వరదరాజు, రఫీ, ప్రపంచ రెడ్డి, వీరన్న, వలపదాస్ రాము, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు._
మహిళా అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన సావిత్రిబాయి పూలే
byBLN TELUGU NEWS
-
0
Post a Comment