శాయంపేట: మండల కేంద్రం లో స్వామి వివేకానంద 162 జయంతి ఉత్సవాల

శాయంపేట మండల కేంద్రరం లో మాజీ వైస్ ఎంపీపీ వంగాల నారాయణరెడ్డి హాజరై స్వామి వివేకానంద 162 జయంతి సందర్భంగా వారికీ పూలమాలవేసి నమస్కరించారు గ్రామ సిబ్బందిని పలువురిని శాలువాతో సన్మంచి బహుమతి ప్రదానం చేయటం జరిగింది ఈ కార్యక్రమం లో వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద అపురూప ప్రజ్ఞావంతుడు, పాశ్చాత్య తత్త్వశాస్త్రంతో సహా పలు విభిన్న జ్ఞాన క్షేత్రాలలో విస్తృత పరిజ్ఞానం, లోతైన అవగాహన ఉన్న ధీమంతుడు. హిందూ మత సందేశాన్ని, సనాతన ధర్మాన్ని ప్రపంచానికి అందించిన తొలి భారతీయ పరివ్రాజకుడు. సనాతన విలువల, సంస్కృతీ సంప్రదాయాల, హిందూ మత సర్వోన్నతిని నిర్ణయాత్మకంగా నెలకొల్పిన దార్శనికుడు, కార్యదక్షుడు వివేకానంద అని వారు స్మరించుకోవడం జరిగింది కార్యక్రమంలో శాయంపేట మాజీ సర్పంచ్ సదానందం, మాజీ ఉపసర్పంచ్ దైనంపల్లి సుమన్, యూత్ నాయకుడు బేరుగు రాకేష్, తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post