స్వామి వివేకానంద 162 వజయంతి వేడుకలు

శాయంపేట మండల కేంద్రంలో స్వామి వివేకానంద 162 వజయంతి వేడుకలు బిజెపి మండల అధ్యక్షులు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిశిధర్ రెడ్డి విచ్చేశారు ముందుగా వివేకానంద విగ్రహానికి పూలమాలవేసి అనంతరమైన ఆయన మాట్లాడుతూ
స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. 1863 జనవరి 12 నాడు కోల్ కత్తాలో జన్మించారు. కేవలం 39 సంవత్సరాల ఆరు నెలలు జీవించారు. అంతతక్కువ వయోపరిమితిలో కూడా అనితర సాధ్యమైన పనులు నిర్వర్తించారు. ముఖ్యంగా ఒక అద్వైత వేదాంతి తొలిసారిగా పాశ్చాత్య దేశాలను పర్యటించడం... ప్రపంచానికి అంతటికీ భారతీయుల ఔన్నత్యాన్ని చాటిచెప్పడం అనేవి స్వామి వివేకానందలోనే చూడగలం. స్వామి శిష్యులలో పాశ్చాత్యులు సైతం భారతదేశానికి ఎంతో సేవచేశారు.స్వామి వివేకానందుల జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటాం. యుక్తవయస్సులోనే భారతీయ కీర్తిపతాకను ప్రపంచ వేదికపై రెపరెపలాడించిన మహనీయుడు. యువజనులలో స్ఫూర్తి నింపితే వారే దేశానికి వెలుగునిస్తారని నమ్మిన మానవతావాది. నేటికీ యువతరం హృదయాలలో ఆయన వ్యక్తిత్వం మహోన్నతంగా ప్రకాశిస్తూనే ఉంది. వివేకానందుల జయంతి సందర్భంగా ఆయన సందేశాలు జ్ఞాపకం చేసుకొని ఆచరిద్దాం. ‘దేవుడు మానవుణ్ణి తన పోలికలతో సృష్టించాడు’ అనే మాట తప్పు. మానవుడే దేవుణ్ణి తన పోలికలతో సృష్టించుకున్నాడు అనడం ఒప్పు. విశ్వమంతటా మనం మనకు ప్రతిరూపాలుగా దేవుళ్లను సృష్టించుకుంటున్నాం అన్నారు స్వామి వివేకానంద. ఆయన చేసిన అద్వైత వేదాంత ప్రబోధకమైన ఈ ప్రసంగం చదివితే యువజనుల్లో ఆయన రగిలించిన స్ఫూర్తి ఎలాంటిదో అర్ధమవుతుంది. ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు బాసని విద్యాసాగర్ కానుగల నాగరాజు బాసని నవీన్ కొత్తపల్లి శ్రీకాంత్ కొడపాక స్వరూప ఎర్ర రాకేష్ రెడ్డి గంగుల రమణారెడ్డి కుక్కల మహేష్ బత్తుల రవి కోమటి రాజశేఖర్ వికాస్ తదితరులు పాల్గొన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post