శాయం పేట మండల కేంద్రంలో అతి పురాతనమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో అయ్యప్ప మాల ధరించిన స్వాములు శనివారం ఇరుముడి కట్టుకొని శబరిమల యాత్రకు స్వామియే శరణమయ్యప్ప అంటూ భజనలు చేసుకుంటూ బయలుదేరినారు. కఠినమైన అయ్యప్ప స్వామి నియమ నిబంధనలతో 41 రోజుల పాటు అయ్యప్ప దీక్ష చేసిన స్వాముల కు ఉదయం శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో గురుస్వామి రాచర్ల ప్రకాష్ ఆధ్వర్యంలో అయ్యప్ప పూజ చేసి ఇరుముడి కట్టినాడు. తరువాత స్వాములకు మోత్కూరి భాస్కర్ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినారు అనంతరం స్వాములు స్వామియే శరణమయ్యప్ప, శబరిగిరీషనే శరణమయ్యప్ప జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప అంటూ భక్తి పాటలు పాడుకుంటూ భజనలు చేసుకుంటూ శబరిమలై యాత్రకు బయలుదేరినా రు ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి గురుస్వాములు కందగట్ల రమేష్ బాసాని మల్లికార్జున్ బాలకృష్ణ లోకల బోయిన కుమారస్వామి కుసు మ మురళి ప్రభాకర్ రవి కమల్ మార్త సుభాష్ సుమన్ మాధవ చంటి ఉప్పు నర్సయ్య భక్తులు పాల్గొన్నారు
శబరిమల యాత్రకు బయలుదేరిన అయ్యప్ప స్వాములు.
byBLN TELUGU NEWS
-
0
Post a Comment