వైద్య సిబ్బంది సమయపాలన
పాటించకపోతే చర్యలు తప్పవని డిఎంహెచ్వో డాక్టర్ అల్లెం అప్పయ్య హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆయన తనిఖీ చేశారు. పి హెచ్ సి లో అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకొని రిజిస్టర్లను తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అనంతరం ఆశడేకార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గ్రామాలలో ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందించడంలో ఆశా కార్యకర్తలదే ముఖ్యపాత్ర అని అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఆశ వర్కర్లు ముందు వరుసలో నిలవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తల సేవలు కీలకమన్నారు. గ్రామాల్లో గర్భిణీలను గుర్తించి ఆన్లైన్ లో వివరాలు నమోదు చేయాలన్నారు. నార్మల్ డెలివరీ లపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు శశి కుమార్, విద్య శ్రీ, సిహెచ్ సుగుణ, హెచ్ ఓ వెంకటేశ్వర వర్మ, సిబ్బంది, ఆశాలు పాల్గొన్నారు.
Post a Comment