శాయంపేట, అక్టోబర్ 18: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రజలకు తెలియజేయడంలో పత్రికలు, ప్రత్యేక సంచికలు కీలక పాత్ర పోషిస్తాయని శాయంపేట సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సై పరమేశ్వర్ అన్నారు. జన నిర్ణయం పత్రిక ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ, దసరా ప్రత్యేక సంచికను వారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతను పుస్తక రూపంలో ప్రజలకు పరిచయం చేసేలా ప్రత్యేక సంచికను రూపొందించిన ఎడిటర్ రాజేందర్‌ను అభినందించారు. తెలంగాణ పండుగల ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేయడంలో ఇలాంటి ప్రత్యేక సంచికలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎడిటర్ రాజేందర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జన నిర్ణయం పత్రిక శాయంపేట మండల విలేకరి ఉప్పు నర్సయ్య, మాజీ ఎంపీటీసీ వినుకొండ శంకరాచారి, శాయంపేట ఏడో వార్డు సభ్యుడు కొత్తపెళ్లి రవీందర్, ఎన్‌ఎస్‌యూఐ మండల అధ్యక్షుడు సాధు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment