మహిళా సంఘాలపై అధికారుల ఆకస్మిక తనిఖీలు27 గ్రూపులు.. 250 మంది మహిళల రికార్డుల పరిశీలన

శాయంపేట: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మాందారిపేట గ్రామంలో మహిళా సంఘాలకు సంబంధించిన రికార్డులను అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహిళా సంఘాల నిర్వహణ, పొదుపు నిధుల వినియోగం, ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకతను పరిశీలించేందుకు ఈ తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా గ్రామంలోని 27 మహిళా సంఘాలకు చెందిన సుమారు 250 మంది సభ్యుల రికార్డులు, పొదుపు ఖాతాలు, నగదు డ్రా వివరాలు, సంఘాల నిర్వహణకు సంబంధించిన డేటాను అధికారులు పరిశీలించారు. మహిళల నుంచి వాంగ్మూలాలు సైతం సేకరించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. మహిళా సంఘాల రిజిస్టర్లు, ఆర్థిక లావాదేవీల వివరాలను ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. సంఘ సమావేశాలు నిర్వహించకుండా, సభ్యుల అనుమతి లేకుండా డబ్బులు డ్రా చేయడం, సమావేశాలు జరగకుండానే జీతాల పేరుతో నిధులు తీసుకోవడం సరికాదని స్పష్టం చేశారు. తనిఖీల్లో ఏవైనా అక్రమాలు లేదా అవకతవకలు గుర్తిస్తే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ తనిఖీల్లో శ్రీనివాసరెడ్డి, రవీందర్, ఏపీఎం హరికృష్ణ, మల్లేశం తదితర అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post