శాయంపేట మండలంలో వరి పంటల క్షేత్ర పరిశీలనజోగంపల్లి, పెద్దకోడెపాక, మైలారం, కొప్పుల గ్రామాల్లో వరి పంటల పరిశీలన

హనుమకొండ/శాయంపేట, బీఎల్‌ఎన్ దినపత్రిక:హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో సాగవుతున్న వరి పంటలను వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరకాల సహాయ వ్యవసాయ సంచాలకుల (ఏడీఏ) ఆదేశాల మేరకు జోగంపల్లి, పెద్దకోడెపాక, మైలారం, కొప్పుల గ్రామాల్లో రైతులతో కలిసి వరంగల్-44 (డబ్ల్యూజీఎల్-44), సిద్ధిపేట వరి రకాల పంటలను పరిశీలించారు.ఈ సందర్భంగా పంటల ప్రస్తుత స్థితిగతులు, ఎదుగుదల పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో గుర్తించిన అంశాలతో సమగ్ర నివేదికను రూపొందించారు.అనంతరం పంటల పరిశీలన నివేదికను పరకాల సహాయ వ్యవసాయ సంచాలకులకు సమర్పించారు. పంటల పరిస్థితిని శాస్త్రీయంగా విశ్లేషించి, అవసరమైన తదుపరి చర్యలు చేపట్టేందుకు సంబంధిత శాస్త్రవేత్తను క్షేత్రస్థాయి పరిశీలనకు పంపించాలని కోరారు.పంటల పరిస్థితిపై శాస్త్రీయ విశ్లేషణ ద్వారా రైతులకు తగిన సూచనలు అందించి, సాగులో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే ఈ పరిశీలన ముఖ్య ఉద్దేశం.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post