హైదరాబాద్, అక్టోబర్ 28: యాదాద్రి భువనగిరి జిల్లా లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ కె. వెంకటేశ్వర్లు రూ.20 వేల లంచం వ్యవహారంలో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. పెట్రోల్ బంక్‌కు వెరిఫికేషన్ సర్టిఫికెట్ జారీ చేసి, డైలీ సేల్స్ రిజిస్టర్ అందజేసినందుకు లంచం డిమాండ్ చేశారు. తన సూచన మేరకు ప్రైవేటు వ్యక్తి, పెట్రోల్ బంక్ టెక్నీషియన్ కాసారం రవీందర్ ద్వారా హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌లో ఫిర్యాదుదారుడి నుంచి రూ.20 వేలు తీసుకున్నారు.
ఈ మొత్తంలో రూ.15 వేలు ఇన్‌స్పెక్టర్‌కు, రూ.5 వేలు రవీందర్‌కు చెందాల్సి ఉండగా, ఏసీబీ అధికారులు లంచం సొమ్మును రవీందర్ వద్ద స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరిచి, న్యాయ రిమాండ్‌కు తరలించనున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను వెల్లడించలేదు.
Post a Comment