కేటీఆర్ పాస్‌పోర్ట్ సీజ్ చేయాలని ఎలా నిర్ణయించారు..?!! పాస్‌పోర్ట్ ఆఫీసుతో నేరుగా మీకేం పని, కోర్టు అనుమతి తీసుకున్నారా?

కేటీఆర్ పాస్‌పోర్ట్ జప్తు అంశంలో ఏసీబీ తీరును తప్పుపడుతూ అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు
పాస్‌పోర్ట్ జప్తు నోటీసులపై స్టేటస్ కో జారీ చేసిన తెలంగాణ హైకోర్టుఫార్ములా ఈ రేస్ అక్రమ కేసులో కేటీఆర్ పాస్‌పోర్ట్ సీజ్ చేయాలని రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసుకు లేఖ రాసిన ఏసీబీ అధికారులుఏసీబీ అధికారుల విజ్ఞప్తితో సెప్టెంబర్ 28వ తేదీన పాస్‌పోర్ట్ ఎందుకు సీజ్ చేయకూడదో వివరణ ఇవ్వాలని కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చిన రీజనల్ పాస్‌పోర్ట్ కార్యాలయందీనిపై అక్టోబర్ 13వ తేదీన పాస్‌పోర్ట్ కార్యాలయంలో విచారణ జరిగిందని, ఏసీబీ అధికారులు చెప్పినందుకే పాస్‌పోర్ట్ అధికారులు ఏకపక్షంగా నోటీసులు జారీ చేశారని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్
ఈ పిటిషన్ విచారిస్తూ "మీరు చట్టానికి అతీతులు కాదు, మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం కుదరదు, పాస్‌పోర్ట్ ఆఫీసుతో ఏసీబీకి ఏంటి పని" అంటూ ఏసీబీపై అసహనం వ్యక్తం చేసిన జస్టిస్ ఈవీ వేణుగోపాల్ పాస్‌పోర్ట్ నోటీసుల వ్యవహారంలో తదుపరి చర్యలు తీసుకోకుండా స్టేటస్ కో విధించిన హైకోర్టుపూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రీజనల్ పాస్‌పోర్ట్ కార్యాలయ అధికారులకు నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను నవంబర్ 6వ తేదీకి వాయిదా వేసిన న్యాయమూర్తి

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post