శాయంపేట: హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో శారదా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని MPPS శాయంపేట పాఠశాలలో ఎస్‌జీటీగా విధులు నిర్వహిస్తున్న బొలిశెట్టి ప్రవీణను విద్యారంగంలో అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా భారత్ గురురత్న అవార్డుతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమానికి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ బి.ఎన్. శ్రీనివాస్ హాజరై బొలిశెట్టి ప్రవీణకు అవార్డును ప్రదానం చేశారు.విద్యార్థుల విద్యాభివృద్ధి, వారి భవిష్యత్ తీర్చిదిద్దడంలో ఆమె అందిస్తున్న సేవలను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా శాయంపేట మండల విద్యాశాఖ కార్యాలయం, MPPS శాయంపేట పాఠశాల తరఫున బొలిశెట్టి ప్రవీణకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
విద్యార్థులకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని వారు ఆకాంక్షించారు.
Post a Comment