శాయంపేట, సెప్టెంబర్ 7: తెలంగాణలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నిర్వహించిన ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకునేందుకు శాయంపేట బీజేపీ మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారుఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం సరికాదన్నారు. ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తున్న బీజేపీ నాయకులను పోలీసుల ద్వారా అణచివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోతున్నాయని, దీంతో విద్యార్థులు, విద్యాసంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ప్రశ్నించే నాయకులపై పోలీసులను ప్రయోగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును కాలరాయడం సరికాదని, ముందస్తు అరెస్టులతో ఉద్యమాలను అడ్డుకోలేరని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.అరెస్టులు, బెదిరింపులు, పోలీస్ నిర్బంధాలతో బీజేపీ పోరాటాన్ని ఆపడం ఎవరి వల్లా కాదని, విద్యార్థుల భవిష్యత్తు, హక్కుల కోసం పోరాటం మరింత ఉధృతంగా కొనసాగుతుందని నరహరిశెట్టి రామకృష్ణ తెలిపారు.
ముందస్తు అరెస్టుల్లో ఏబీవీపీ నాయకుడు ఆకుతోట భాను ప్రసాద్ కూడా ఉన్నట్లు తెలిపారు.
Post a Comment