కక్షపూరితంగా గడ్డిమందు కొట్టి వరి పంట ధ్వంసంబాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుల

శాయంపేట: మండలంలోని గోవిందాపూర్ గ్రామానికి చెందిన బొత్త లక్ష్మికి చెందిన వరి పంటను కక్షపూరితంగా గడ్డిమందు కొట్టి నాశనం చేసిన వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
బొత్త లక్ష్మి సాగు చేస్తున్న 0.20 గుంటల వరి పొలంలో గతంలో వేసిన వరి నాటును ఎడ్ల గొర్రుతో తొక్కించి పంటను నష్టపరిచారని, ఈ విషయమై శాయంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. అనంతరం పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు.
తిరిగి వరి పంట పెరిగిన అనంతరం మాందాటి తిరుపతి, మాందాటి తిరుమలేశ్, మాందాటి కుమారస్వామి గడ్డిమందు కొట్టడంతో పంట దెబ్బతిని తీవ్రంగా నష్టం వాటిల్లిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. వ్యక్తిగత కక్షల కారణంగానే ఈ చర్యకు పాల్పడ్డారని వారు పేర్కొన్నారు.
రైతు కష్టపడి సాగు చేసిన పంటను ఈ విధంగా నాశనం చేయడం దుర్మార్గమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు, సంబంధిత వ్యవసాయ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, పంట నష్టాన్ని అంచనా వేసి, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post