శాయంపేట, జూలై 16: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామంలో కురుమ కులస్తుల ఆరాధ్య దైవమైన బీరన్న దేవుని తొలి ఏకాదశి బోనాల ఉత్సవాలను శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డోలు వాయిద్యాల నడుమ, టపాసుల సందడి మధ్య బీరన్న బోనాలను గ్రామ వీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శోభాయాత్రను తిలకించారు.
ఈ సందర్భంగా భక్తులు బీరన్న దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ కార్యక్రమాన్ని పెద్దకోడెపాక కురుమ కుల పెద్దమనిషి అమ్మ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో అన్న మహేందర్, అమ్మ అశోక్, ముజిగిరి వేణు, కొమ్ము సారంగపాణి, కొమ్ము శ్రీనివాస్, అమ్మ సాంబయ్య, ముజిగిరి చంద్రమౌళి, చిట్టి రమేష్, బుట్టి సురేష్, నంద రాజ్‌కుమార్, అమ్మ కిరణ్ తదితర కురుమ కులస్తులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post a Comment