శాయంపేట, జూలై 15: శాయంపేట చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి మరియు విక్రయ సంఘం నూతన అధ్యక్షుడు బాసని ప్రకాష్ బుధవారం భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా చేనేత సహకార సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేసిన బాసని ప్రకాష్, చేనేత కార్మికుల సంక్షేమం, సంఘ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. సంఘ అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని అందించాలని ఎమ్మెల్యేను కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు బాసని ప్రకాష్‌కు అభినందనలు తెలియజేస్తూ, చేనేత కార్మికుల సంక్షేమం కోసం సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం తరఫున చేనేత రంగానికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో చేనేత సంఘం ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.య
Post a Comment