శాయంపేట చేనేత సహకార సంఘం ఎన్నికలు18 మంది అభ్యర్థులకు ఎన్నికల గుర్తుల కేటాయింపు

శాయంపేట మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘం ఎన్నికల ప్రక్రియలో భాగంగా మొత్తం 21 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, అందులో ముగ్గురు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని ఎన్నికల అధికారి ఎం. సునీల్ కుమార్ తెలిపారు.
దీంతో ఎన్నికల బరిలో మిగిలిన 18 మంది అభ్యర్థులకు సోమవారం ఎన్నికల గుర్తులను కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం తదుపరి ప్రక్రియ కొనసాగుతుందని, ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post