దేవాలయ భూములను పరిరక్షించుకోవాలి: దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ నందనం కవిత

హనుమకొండ : గ్రామాల్లో ధూప దీప నైవేద్య పథకంలో పనిచేస్తున్న ఆలయాలు కు సంబంధించిన భూములను పరిరక్షించుకోవాలని దేవదాయ శాఖ వరంగల్ డివిజన్ ఇన్స్పెక్టర్ నందరం కవిత సూచించారు. మంగళవారం హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన ధూప దీప నైవేద్య అర్చక సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా అర్చకుల సమస్యలు తెలుసుకున్నారు అర్షకులకు రావలసిన సమస్యలపై అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి చొరవ చూపించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆలయం బాగుండాలి అర్చకుడు బాగుండాలి గ్రామం బాగుండాలి అనే భావనతో అర్చకులు పనిచేయాలన్నారు. ఆలయాలను ప్రతిరోజు శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి ధూప దీప నైవేద్యాలు కచ్చితంగా నిర్వహించాలని లేనిచో తగు శాఖాపరమైన చర్యలు తీసుకొనబడతాయని ఆమె సూచించారు. అర్చకులు సామాజిక మాధ్యమాల్లో పలు పత్రికలలో అధికారులపై ఎటువంటి ప్రచారం చేసిన ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారని ఆమె పేర్కొన్నారు ప్రతి అర్చకుడు తప్పనిసరిగా సమయపాలన పాటిస్తూ పూజ కార్యక్రమంలో నిర్వహించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ధూప దీప నైవేద్య అర్చక సంఘం వరంగల్ హనుమకొండ జిల్లాల అధ్యక్షులు గణేష్ కుమార్ సిద్ధాంతి పారుపల్లి ఉపేందర్ శర్మ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీందర్ శర్మ ఉపాధ్యక్షులు లక్ష్మీకాంత్ శర్మ కోశాధికారి వీరమల్లయ్య శర్మ తదితరులు పాల్గొన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post