శాయంపేట జూలై 16: ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా శాయంపేట మండలం గోవిందాపూర్ గ్రామంలో డీసీసీ బ్యాంక్ ఆత్మకూర్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు పొదుపు, బ్యాంకింగ్ సేవలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దాసి స్వాతి–శ్రావణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు పొదుపు అలవాటు యొక్క ప్రాముఖ్యత, రుద్రమదేవి డిపాజిట్ పథకం, బ్యాంకు ఖాతాల సౌకర్యాలు, ప్రధానమంత్రి బీమా పథకాలు, బ్యాంకు ద్వారా అందించే వివిధ రుణాల వినియోగం, తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడం వల్ల కలిగే ప్రయోజనాలు, క్రెడిట్ క్రమశిక్షణ, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు, సైబర్ భద్రతపై గ్రామస్తులకు వివరించారు.
అలాగే డిజిటల్ లావాదేవీలు నిర్వహించే సమయంలో అపరిచితుల మాటలు నమ్మవద్దని, ఓటీపీ, ఏటీఎం పిన్, బ్యాంకు వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని సూచిస్తూ సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ బ్యాంకు మేనేజర్ హరిత, శాయంపేట పీఏసీఎస్ సీఈఓ మోహన్, బ్యాంకు సిబ్బంది, గ్రామ రైతులు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.
Post a Comment