మిషన్ భగీరథ నీటిపై ప్రజల ఆందోళనఏడు నెలలుగా వాటర్ ఫిల్టర్ వర్కర్ లేకపోవడంతో ఇబ్బందులునీటి నాణ్యతపై అధికారులు స్పందించాలని మండల ప్రజలుగ్రామస్తుల ప్రజలు డిమాండ్

శాయంపేట, జూలై 16 (BLN తెలుగు దినపత్రిక):
శాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో మిషన్ భగీరథ తాగునీటి సరఫరాపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటర్ ఫిల్టర్ చేసే వర్కర్ గత ఏడు నెలలుగా విధులకు రాకపోవడంతో నీటి శుద్ధి ప్రక్రియ సక్రమంగా జరగడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న నీరు మురికిగా కనిపిస్తోందని, ఈ నీటిని తాగితే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు, మిషన్ భగీరథ సిబ్బంది వెంటనే స్పందించి నీటి నాణ్యతను పరిశీలించాలని కోరుతున్నారు.
తాగునీటి విషయంలో నిర్లక్ష్యం వహించకుండా ఫిల్టర్ ప్లాంట్ల నిర్వహణను పర్యవేక్షించాలని, అవసరమైన సిబ్బందిని నియమించి ప్రజలకు శుద్ధమైన నీరు అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post