తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు సంబంధించిన గడువును పొడిగిస్తూ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నిర్ణయం తీసుకుంది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు ఆగస్టు 3వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు ఈసీఐ వెల్లడించింది.
గడువు ముగిసేలోపు అర్హులైన ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకోవాలని, అవసరమైన మార్పులు, చేర్పులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా సవరణలు చేపట్టేందుకు ఈ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.
ఎన్నికల సంఘం నిర్ణయంతో ఓటర్లకు మరింత సమయం లభించనుంది. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Post a Comment