కేకే కమిటీ సమావేశానికి ఉద్యమకారులు అధిక సంఖ్యలో హాజరుకావాలితెలంగాణ ఉద్యమకారుల ఫోరం పిలుపు

శాయంపేట, జూలై 16: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో గురువారం శాయంపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు ఇమ్మడిశెట్టి రవీందర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఫోరం జిల్లా అధ్యక్షుడు పొడిశెట్టి గణేష్ మాట్లాడుతూ, ఈ నెల **17వ తేదీన హైదరాబాద్‌లోని సచివాలయం ఎదురుగా ఉన్న అమరజ్యోతి హాల్‌లో కేకే కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశానికి తెలంగాణ ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై కేకే కమిటీ సూచనలు స్వీకరించనున్నందున ప్రతి ఉద్యమకారుడు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాలని కోరారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ఎలాంటి జాప్యం లేకుండా ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు గిద్దెమారి సురేష్, యూత్ జిల్లా అధ్యక్షుడు కొమ్ముల శివ, జిల్లా కార్యదర్శి ఉప్పు రాజు, మండల కార్యదర్శి దుంపల మహేందర్ రెడ్డి, మండల కోశాధికారి కానుగుల నాగరాజు, గ్రామ అధ్యక్షుడు రంగు మహేందర్, గ్రామ కమిటీ సభ్యుడు కోల నందం, మండల నాయకుడు అడప ప్రభాకర్, చిందం ప్రభాకర్, మండల కార్యదర్శి తుమ్మ ప్రభాకర్, ఎండీ రఫీ, ఎండీ మాధర్, నమిత, బాజా అశోక్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post