శ్రీశ్రీశ్రీ శ్వేత లక్ష్మి వారాహి ఆలయంలో వైభవంగా శాకాంబరి ఉత్సవాలుప్రత్యేక పూజల్లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. చందుపట్ల కీర్తి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషీధర్ రెడ్డి

రేగొండ, జూలై 29 (BLN తెలుగు దినపత్రిక): రేగొండ మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ శ్వేత లక్ష్మి వారాహి ఆలయంలో బుధవారం శాకాంబరి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని సుందరంగా అలంకరించి, అమ్మవారికి శాకాంబరి అలంకరణ, వారాహి హోమం, పూర్ణాహుతి, 54 రకాల నైవేద్యాలతో మహా నివేదన, గురుపూజోత్సవం, ప్రత్యేక హారతి కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ ఉత్సవాలకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. చందుపట్ల కీర్తి రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషీధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై శ్రీశ్రీశ్రీ శ్వేత లక్ష్మి వారాహి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా డా. చందుపట్ల కీర్తి రెడ్డి మాట్లాడుతూ, శాకాంబరి దేవి అన్నపూర్ణ స్వరూపిణిగా భక్తులపై కరుణా కటాక్షాలు ప్రసాదిస్తుందని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సిరిసంపదలు, సుభిక్షాలతో జీవించాలని ఆకాంక్షించారు. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ పరిరక్షణకు ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు.
పూర్ణాహుతి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, ప్రసాద వితరణ నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని వారు కోరారు. అనంతరం కీర్తి రెడ్డి, నిషీధర్ రెడ్డి భక్తులతో కలిసి ప్రత్యేక హారతిలో పాల్గొని ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు దాసరి వేణు, సీనియర్ నాయకులు విజేందర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post