మాజీ ఎమ్మెల్యే గండ్రపై నిరాధార ఆరోపణలు మానుకోవాలి – బీఆర్ఎస్ నాయకుల డిమాండ

శాయంపేట, జూలై 29 BLN తెలుగు దినపత్రిక)మాజీఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారంటూ ఇటీవల చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని బీఆర్ఎస్ పార్టీ శాయంపేట మండల మాజీ సోషల్ మీడియా ఇన్‌చార్జి దాసి శ్రావణ్ కుమార్ అన్నారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆరోపణలకు ఆధారాలు ఉంటే ప్రజల ముందుకు తీసుకురావాలని, లేకపోతే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరించిన వారు ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలమని చెప్పుకోవడం విడ్డూరమని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న కార్యకర్తలు ఎవరో ప్రజలకు బాగా తెలుసన్నారు.
గత ఏడు సంవత్సరాలుగా గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర జ్యోతి పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తూ ప్రతి కార్యకర్తకు అండగా నిలిచారని, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటూ సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి నాయకుడిపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని అన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే భూపాలపల్లి నియోజకవర్గానికి గండ్ర వెంకటరమణారెడ్డే పార్టీ నాయకత్వం వహిస్తారని ప్రకటించారని గుర్తు చేశారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గండ్ర వెంకటరమణారెడ్డే పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధిస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో గోవిందపూర్ గ్రామశాఖ మాజీ అధ్యక్షుడు నర్ర రాజు, ఉప సర్పంచ్ కలువాల నరేందర్, మండల మాజీ ఉపాధ్యక్షుడు సౌల్ల కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post