శాయంపేట చేనేత సహకార ఉత్పత్తి, విక్రయ సంఘానికి చెందిన భూమిపై ఎలాంటి అక్రమ జోక్యం, వ్యక్తిగత హక్కుల చెల్లుబాటు ఉండదని పేర్కొంటూ సంఘం సభ్యులు మండల రెవెన్యూ అధికారి (ఎమ్మార్వో)కు బుధవారం వినతిపత్రం సమర్పించారు.
వినతిపత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం, సర్వే నంబర్లు 358/C/2, 355/Bలో ఉన్న మొత్తం 4 ఎకరాల 34 గుంటల భూమి చేనేత సహకార సంఘానికి చెందిన ఉమ్మడి ఆస్తి అని తెలిపారు. ఈ భూమిపై సంఘ సభ్యులందరికీ సమాన హక్కులు ఉన్నాయని, వ్యక్తిగతంగా ఎవరూ హక్కులు చెలాయించే అధికారం లేదని స్పష్టం చేశారు.
సంఘ భూమికి సంబంధించిన అన్ని రికార్డులు, సంబంధిత పత్రాలను ఎమ్మార్వోకు సమర్పించిన సభ్యులు, భూమిపై ఎలాంటి అక్రమ లావాదేవీలు, ఆక్రమణలు లేదా బదిలీలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. చేనేత సహకార సంఘం ఆస్తిని పరిరక్షిస్తూ చట్టబద్ధంగా న్యాయం చేయాలని అధికారులను విజ్ఞప్తి చేశారు.
Post a Comment