శాయంపేట చేనేత సహకార సంఘం ఎన్నికలకు రెండవ రోజు21 నామినేషన్లు

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘం ఎన్నికలకు శుక్రవారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. ఈ సందర్భంగా మొత్తం 21 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి ఎం. సునీల్ కుమార్ తెలిపారు.
దాఖలైన నామినేషన్లలో నలుగురు మహిళలు, 17 మంది పురుషులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల స్వీకరణ ప్రశాంతంగా ముగిసిందని, అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను పాటిస్తూ తమ నామినేషన్ పత్రాలను సమర్పించినట్లు పేర్కొన్నారు.
నామినేషన్ ప్రక్రియ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. నామినేషన్ పత్రాల పరిశీలన అనంతరం  రెండవ రోజు నామినేషన్ ప్రకారం తదుపరి ప్రక్రియ కొనసాగుతుందని ఎన్నికల అధికారి ఎం. సునీల్ కుమార్ తెలిపారు.
చేనేత సహకార సంఘం ఎన్నికలపై సభ్యుల్లో ఆసక్తి నెలకొనగా, రానున్న రోజుల్లో ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post