హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో గురువారం సాయంత్రం వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఉన్నప్పటికీ, మధ్యాహ్నం తర్వాత ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిశాయి.
వాన చినుకులతో మండల కేంద్రంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత కొద్ది రోజులుగా ఎండ వేడితో ఇబ్బందులు పడుతున్న ప్రజలు, వాన జల్లులతో ఉపశమనం పొందారు. చల్లని గాలులు వీచడంతో ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించారు.
మరోవైపు రైతులు కూడా ఈ వర్షాలను స్వాగతించారు. రానున్న ఖరీఫ్ సాగుకు ఈ వర్షాలు ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వాతావరణంలో వచ్చిన మార్పుతో మండల కేంద్రంలో సాయంత్రం వేళ ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది.
Post a Comment