2012 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఎన్. శ్వేత వరంగల్ పోలీస్ కమిషనర్‌గా నియమితులయ్యారు. పదేళ్ల సేవా కాలంలోనే పలు కీలక బాధ్యతలు నిర్వహిస్తూ సమర్థ అధికారిగా గుర్తింపు పొందిన ఆమె, ఇప్పటివరకు తొమ్మిది ముఖ్యమైన పోస్టింగుల్లో సేవలందించారు.ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్. శ్వేత బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ విద్యను పూర్తి చేసి, 2012లో యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి భారతీయ పోలీసు సేవ (ఐపీఎస్)లో చేరారు.
సేవా కాలంలో కామారెడ్డి జిల్లా ఎస్పీ, సిద్ధిపేట పోలీస్ కమిషనర్, హైదరాబాద్ డీసీపీ, డిటెక్టివ్ విభాగంలో కీలక బాధ్యతలు, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్ జోన్) వంటి పలు పదవుల్లో పనిచేశారు. తాజాగా ప్రభుత్వం ఆమెను వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ నియమించింది.
శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మరింత చేరువయ్యే పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇస్తారనే అభిప్రాయం పోలీసు వర్గాల్లో వ్యక్తమవుతోంది.
Post a Comment