శాయంపేట, జూన్ 29: హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని శాయంపేట చేనేత పారిశ్రామికుల సహకార ఉత్పత్తి & విక్రయ సంఘం పాలకవర్గ ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర సహకార ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎం. సునీల్ కుమార్ ఎన్నికల అధికారిగా నియమితులయ్యారు.
ఎన్నికలు జూలై 10, 2026న సంఘ కార్యాలయంలో రహస్య బ్యాలెట్ విధానంలో నిర్వహించనున్నారు. పాలకవర్గంలోని మొత్తం 9 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మహిళలు, ఓపెన్ కేటగిరీలకు రిజర్వేషన్ అమల్లో ఉంటుంది.
నామినేషన్ల స్వీకరణ జూలై 2, 3, 4 తేదీలలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతుంది. నామినేషన్ల పరిశీలన జూలై 5న నిర్వహించి, అర్హుల జాబితాను ప్రకటిస్తారు. నామినేషన్ల ఉపసంహరణ, తుది అభ్యర్థుల జాబితా ప్రకటన, ఎన్నికల గుర్తుల కేటాయింపు జూలై 6న చేపడతారు.
పోలింగ్ జూలై 10న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. అనంతరం ఓట్ల లెక్కింపు నిర్వహించి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రంతో పాటు రంగు ఫోటో, ఆధార్ కార్డు నకలు సమర్పించాల్సి ఉంటుంది. రిజర్వేషన్ కేటగిరీలో రాయితీ పొందే అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా జతచేయాలని ఎన్నికల అధికారి తెలిపారు. ఓటర్లు పోలింగ్ కేంద్రానికి ప్రభుత్వ గుర్తింపు పొందిన ఫోటో ఐడీ కార్డు తీసుకురావాలని సూచించారు.
అర్హులైన ఓటర్ల జాబితాను సంఘ కార్యాలయం, సంబంధిత గ్రామపంచాయతీ కార్యాలయాలు, చేనేత & జౌళి శాఖ, జిల్లా సహకార అధికారి కార్యాలయాల్లో పరిశీలించవచ్చని ఎన్నికల అధికారి తెలిపారు.
Post a Comment