శాయంపేట, జూన్ 28: శాయంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన డ్రంకెన్ డ్రైవ్ కేసులో నిందితుడు బైరీ శంకర్ (తండ్రి నర్సయ్య, గోవిందపూర్ గ్రామం, శాయంపేట మండలం)కు న్యాయస్థానం మూడు రోజుల జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించింది.
అదేవిధంగా మరో ఆరుగురికి డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున జరిమానా విధించింది. జరిమానా విధించబడిన వారిలో మురహరి సంపత్ (వెంకటాపూర్), కట్ట చంటి (కోరుట్ల), తుమ్మల అనిల్ (ప్రగతి సింగారం, శాయంపేట), లాడే తిరుపతి (వరంగల్), రత్నం దేవరాజు (కాళేశ్వరం), దోయియిపడి రాజా శివాజీ (కొత్తగట్టు సింగారం) ఉన్నారు.
ఈ కేసులను విచారించిన ఇన్‌చార్జి ద్వితీయ శ్రేణి మేజిస్ట్రేట్ మరియు అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీమతి శ్రీవల్లి శైలజ తీర్పు వెలువరించారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, మరోసారి డ్రంకెన్ డ్రైవ్‌కు పాల్పడితే నేరుగా జైలుకు పంపిస్తామని నిందితులను హెచ్చరించారు. ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపకుండా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు.
Post a Comment