పరకాల, జూన్ 13: మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న సామాజిక సేవకుడు అమ్మ అశోక్ మరోసారి తన సేవా స్పూర్తిని చాటుకున్నారు. శుక్రవారం పరకాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన 53వ సారి రక్తదానం చేసి అవసరంలో ఉన్న రోగికి ప్రాణదాతగా నిలిచారు.
సమాజ సేవలో ఎప్పుడూ ముందుండే అశోక్, పేద ప్రజలకు వివిధ రూపాల్లో సహాయ సహకారాలు అందించడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేస్తూ అనేక మంది ప్రాణాలను కాపాడుతున్నారు. రక్తదానం ద్వారా ప్రాణాలను రక్షించవచ్చనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది అశోక్ సేవలను కొనియాడుతూ ప్రత్యేకంగా అభినందించారు. “రక్తదానం మహాదానం” అనే నినాదాన్ని ఆచరణలో చూపిస్తున్న అమ్మ అశోక్ సేవలు సమాజానికి స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు.
అవసరమైన ప్రతి సందర్భంలో రక్తదానానికి ముందుకు వస్తున్న అశోక్ మరెందరికో ఆదర్శంగా నిలుస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు
Post a Comment