చేనేత సహకార సంఘ అభివృద్ధికి కృషి చేసిన బాసని బిక్షపతి మృతి పట్ల సంతాపం

శాయంపేట గ్రామానికి చెందిన చేనేత సహకార సంఘ సభ్యుడు భాసని బిక్షపతి మరణం పట్ల పలువురు నేతలు, సంఘ ప్రతినిధులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనేక సంవత్సరాలుగా చేనేత సహకార సంఘంలో అహర్నిశలు శ్రమిస్తూ సంఘ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన బిక్షపతి సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బిక్షపతి చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుండేవారని, సంఘ బలోపేతానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం జిల్లా కార్యదర్శి దిడ్డి రమేష్, శాయంపేట మండల పద్మశాలి సంఘ అధ్యక్షుడు వంగర సాంబయ్య, జిల్లా ప్రచార కార్యదర్శి బాసని బాలకృష్ణ, శాయంపేట గ్రామ మాజీ సర్పంచ్ బాసని రవి, తుమ్మ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post