శాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా ఏఐ అవగాహన కార్యక్రమం

శాయంపేట, : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” విద్యా వారోత్సవాలలో భాగంగా శాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఆరవ రోజు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ కందగట్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇన్నోవేషన్ డే సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పై ప్రత్యేక అవగాహన సదస్సు జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి. ఝాన్సీ రాణి మేడం రిసోర్స్ పర్సన్‌గా పాల్గొని, కృత్రిమ మేధస్సు (A.I.) ప్రస్తుత కాలంలో విద్య, ఉద్యోగాలు, సాంకేతిక రంగాల్లో ఎలా ఉపయోగపడుతోందో డిజిటల్ విధానంలో విద్యార్థులకు వివరించారు. ఏఐ సాంకేతికత భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తుందని, విద్యార్థులు కొత్త టెక్నాలజీలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, యువకులు, గ్రామ ప్రముఖులు గిద్దమరి సురేష్, పొడిశెట్టి గణేష్, సామల బిక్షపతి, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు గుండేటి వెంకటేష్, సామల మణితేజ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు పాల్గొన్న వారందరికీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కందగట్ల కోటేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post