శాయంపేట, మే 16: శాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహణలో పట్టుబడిన 10 మందికి కోర్టు జరిమానా విధించింది. అదేవిధంగా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన మరో వ్యక్తిపై కూడా చర్యలు తీసుకున్నారు.
ఈ కేసులకు సంబంధించి మొత్తం రూ.16,250 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. 2వ తరగతి ఇంచార్జ్ మేజిస్ట్రేట్ మరియు అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీమతి శ్రీవల్లి శైలజ మేడం ఎదుట నిందితులను హాజరుపరిచారు.
ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. మరోసారి డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.
ప్రజలు రోడ్డు భద్రతా నియమాలను పాటించి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసులు సూచించారు.
Post a Comment