లంచ్ బాక్స్‌తో సచివాలయానికి.. సాధారణ ఉద్యోగిలా సీఎం విజయ్ సరికొత్త పంథా

తమిళనాడు రాజకీయాల్లో చారిత్రక విజయంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నటుడు C. Joseph Vijay తన వినూత్న పనితీరుతో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే ఆయన చూపిస్తున్న క్రమశిక్షణ, సమయపాలన అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
మే 10న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ ప్రతిరోజూ నిర్ణీత సమయానికి పావుగంట ముందుగానే చెన్నైలోని Fort St. George లో ఉన్న సచివాలయానికి చేరుకుంటున్నారు. ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగిలా ఇంటి నుంచే స్వయంగా లంచ్ బాక్స్ తీసుకురావడం విశేషం.
భోజన విరామ సమయంలో కూడా ఆయన తన కార్యాలయానికే పరిమితమై, భోజనం ముగిసిన వెంటనే తిరిగి అధికారిక పనుల్లో నిమగ్నమవుతున్నారు. సీఎం విజయ్ అవలంబిస్తున్న ఈ సరళ జీవనశైలి, సమయపాలన అధికారులతో పాటు ప్రజల్లో కూడా ప్రశంసలు అందుకుంటోంది.
ప్రభుత్వ యంత్రాంగంలో క్రమశిక్షణ, సమర్థత పెంపొందించేందుకు సీఎం విజయ్ చూపిస్తున్న నిబద్ధత కొత్త రాజకీయ సంస్కృతికి నాంది పలుకుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post