హనుమకొండ, మే 16: టీయూడబ్ల్యూ (ఐజేయూ) హనుమకొండ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ‘ఆంధ్రప్రభ’ రిపోర్టర్ రంగు శ్రీధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘ నాయకులు, సహచర పాత్రికేయులు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
పాత్రికేయుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షిస్తూ పలువురు అభినందనలు తెలియజేశారు. రంగు శ్రీధర్ జర్నలిజం రంగంలో చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రంగు శ్రీధర్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
Post a Comment