టీయూడబ్ల్యూజే-ఐజేయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడ గడ్డం కేశవ మూర్తి.కార్యదర్శిగా ఊటుకూరి సీతారామారావుభారీ మెజారిటీతో నూతన కమిటీ విజయం

హనుమకొండ, మే 18:
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) హనుమకొండ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష, కార్యదర్శి అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారు. జిల్లా అధ్యక్షుడిగా గడ్డం కేశవమూర్తి, ప్రధాన కార్యదర్శిగా ఊటుకూరి సీతారామారావు (సాయి) ఘన విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి కంకణాల సంతోష్ అధికారికంగా ప్రకటించారు.
జిల్లాలోని జర్నలిస్టులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ ఎన్నికల్లో మొత్తం 407 ఓట్లకు గాను 217 ఓట్లు పోలయ్యాయి. అధ్యక్ష పదవికి పోటీ చేసిన గడ్డం కేశవమూర్తికి 208 ఓట్లు లభించగా, ప్రత్యర్థి గుంటి విద్యాసాగర్‌కు 4 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో 5 ఓట్లు చెల్లనివిగా ప్రకటించారు. దీంతో కేశవమూర్తి 204 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.
అదేవిధంగా ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసిన ఊటుకూరి సీతారామారావు (సాయి) 204 ఓట్లు సాధించగా, ప్రత్యర్థి మేరుగు రాజేంద్రప్రసాద్‌కు 7 ఓట్లు వచ్చాయి. 6 ఓట్లు చెల్లనివిగా తేలడంతో సాయిరాం 197 ఓట్ల మెజారిటీతో ఘన విజయాన్ని నమోదు చేశారు.
కోశాధికారితో పాటు మిగిలిన కార్యవర్గ సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోశాధికారిగా పొడిశెట్టి విష్ణువర్ధన్ ఎన్నిక కాగా, ఉపాధ్యక్షులుగా దండుమోహన్, ఇమ్మడి ప్రసాద్, గునిశెట్టి విజయభాస్కర్, అల్లె రామారావు ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శులుగా జి. బాలరాజు, గన్ను సంతోష్ కుమార్, బోయిని భిక్షపతి, ఎండీ ఖాదర్ పాష ఎన్నికయ్యారు.
కార్యవర్గ సభ్యులుగా డి. రాధాకృష్ణ, జి. రామానుజం, ఆర్వీ దామోదర్, పి. ప్రదీప్ రాజ్, ఎండీ జమాలొద్దీన్, ఎ. సాంబశివరాజు, ఎండీ ఉస్మాన్ పాష, ఎండీ ఫజర్ ఉర్ రహమాన్, ఎ. విష్ణువర్ధన్ రాజు, ఆర్. శ్రీధర్, ఎం. ఓదెలు, ఓదెల శివకుమార్, కొట్టె సుధాకర్, పులికంటి రాజేందర్, ఎం. సంతోష్ కుమార్, ఇ. జగన్, ఏ. కొమ్మాలులు ఎన్నికయ్యారు.
ఎన్నికల అనంతరం ఎన్నికల అధికారి కంకణాల సంతోష్ మాట్లాడుతూ.. నూతన కమిటీ జర్నలిస్టుల హక్కుల సాధన, సంక్షేమం కోసం సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. కొత్తగా ఎన్నికైన బాధ్యులకు జిల్లాలోని పలువురు సీనియర్ జర్నలిస్టులు, పాత్రికేయ మిత్రులు శుభాకాంక్షలు తెలిపారు.
రెండు రోజుల పాటు పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించిన రిటర్నింగ్ అధికారి కంకణాల సంతోష్‌తో పాటు అబ్జర్వర్లుగా వ్యవహరించిన గాడిపెల్లి మధు, పీవీ మదన్ మోహన్, పిన్నా శివకుమార్, వల్లాల వెంకటరమణ, పెండెం వేణుమాధవ్‌లను టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కే. విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కే. రామనారాయణ ప్రత్యేకంగా అభినందించారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post