నేరాల నియంత్రణకు ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి : సీఐ సుధాకర్ రెడ్డి

శాయంపేట మండలంలోని గ్రామాల్లో నేరాల నియంత్రణకు ప్రజలు ముందుకు వచ్చి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సీఐ వై. సుధాకర్ రెడ్డి కోరారు. బుధవారం మండలంలోని రాజుపల్లి, ప్రగతి సింగారం గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.రాజుపల్లి గ్రామంలో సర్పంచ్ లక్ష్మణరావు, ఉప సర్పంచ్ రాజు, గ్రామ పార్టీ అధ్యక్షుడు తిరుపతిరావు మరియు గ్రామ సభ్యుల సహకారంతో రూ.25 వేల విలువైన నాలుగు సోలార్ సీసీ కెమెరాల డెమోన్స్ట్రేషన్‌ను సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సై పరమేష్ సమక్షంలో నిర్వహించారు.
అలాగే ప్రగతి సింగారం గ్రామంలో బోనెపల్లి రఘుపతి రెడ్డి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రూ.25 వేల విలువైన నాలుగు సోలార్ సీసీ కెమెరాల ఏర్పాటు కోసం సహకరించారు. ఈ సందర్భంగా అక్కడ కూడా సీసీ కెమెరాల డెమోన్స్ట్రేషన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల దొంగతనాలు, ఇతర నేరాల నియంత్రణకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రజలు, గ్రామ పెద్దలు పోలీసులకు సహకరించి ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని నేరాల నియంత్రణలో భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post