గోవా రాష్ట్రంలో మాండవి నది మార్గంలో క్రూయిజ్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ (ఐహెచ్‌ఆర్‌ఎఫ్) ఆధ్వర్యంలోని “అంతర్జాతీయ డిఫెండర్స్ అవార్డ్స్” కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మిట్టపల్లి రాధికా అంతర్జాతీయ డిఫెండర్స్ అవార్డును అందుకున్నారు.
ఈ కార్యక్రమానికి ఐహెచ్‌ఆర్‌ఎఫ్ నేషనల్ చైర్మన్ మరియు ఫౌండర్, హైకోర్టు అడ్వకేట్ కొంగర అనిల్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో కేవలం ముగ్గురు సభ్యులతో ప్రారంభమైన ఐహెచ్‌ఆర్‌ఎఫ్ సంస్థ ప్రస్తుతం దాదాపు 18 వేల మంది సభ్యులతో దేశవ్యాప్తంగా సేవలందించడం గర్వకారణమన్నారు.
సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, బాల్య వివాహాల నిర్మూలన, గృహ హింస బాధిత మహిళలకు రక్షణ కల్పించడం వంటి అనేక అంశాల్లో సంస్థ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. బాధితులకు అండగా నిలుస్తూ, వారి సమస్యలను న్యాయస్థానాలు, మానవ హక్కుల సంస్థలు, లోకాయుక్త దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తున్నారని తెలిపారు.
ఈ క్రమంలో మిట్టపల్లి రాధికా మహిళల హక్కుల పరిరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేష కృషి చేసినందుకు గుర్తింపుగా ఈ అంతర్జాతీయ అవార్డును ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ అవార్డు అందుకోవడం పట్ల రాధికాకు పలువురు సామాజిక కార్యకర్తలు, మహిళా సంఘాల నాయకులు, ఐహెచ్‌ఆర్‌ఎఫ్ సభ్యులు అభినందనలు తెలిపారు.
Post a Comment