శాయంపేట మండలంలో మొక్కజొన్న కాంట్రాక్ట్ (కాంట్రా) వేసుకున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొనుగోలు కోసం లారీలు సమయానికి రావడం లేదని ఆరోపిస్తూ రైతులు మాందారిపేట స్టేజీ వద్ద ధర్నాకు దిగారు.
పెద్ద సంఖ్యలో చేరుకున్న రైతులు రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తూ, ఇప్పటికే కోత కోసిన మొక్కజొన్నను పొలాల్లో మరియు కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉంచడంతో నష్టాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లారీలు ఆలస్యంగా రావడం వల్ల ధాన్యం తడిసి నాణ్యత తగ్గిపోతుందని, దీంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నామని తెలిపారు.
కాంట్రాక్టు ప్రకారం వెంటనే లారీలు పంపించి మొక్కజొన్నను కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు, నిర్వాహకులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.ధర్నా కారణంగా కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Post a Comment